- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏడో అంతస్తు నుంచి దూకి విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య..
by Taduka Kalyani |
ఓ విశ్రాంత ఉద్యోగి ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, కార్వాన్ : ఓ విశ్రాంత ఉద్యోగి ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. డబిల్పురకు చెందిన బాబు (62) కమర్షియల్ టాక్స్ ఆఫీసులో పనిచేసి మూడేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. అయితే మృతుడు శుక్రవారం మధ్యాహ్నం అబిడ్స్ లోని మయూర్ కుశల్ కాంప్లెక్స్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతుడు పై నుంచి కింద పడడంతో అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బాడీని పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసి డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






