లాస్ట్ స్టేజికి చేరిన 'స్వయంభు'.. విడుదల అప్పుడే

by Pulgam srinivas |

'స్వయంభు' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ కాపీ ఈ వారం సిద్ధం కానున్నట్లు సమాచారం.

లాస్ట్ స్టేజికి చేరిన స్వయంభు.. విడుదల అప్పుడే
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు నిఖిల్ చాలా కాలం క్రితమే 'స్వయంభు' చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణ పనులు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. దీంతో సినిమా విడుదల కూడా ఆలస్యమవుతూ వస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని, ఈ వారంలో ఫస్ట్ కాపీ సిద్ధం కానుందని తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాను ఆగస్టు నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాపై నిఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి 'స్వయంభు' ఆయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా, భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.

Next Story