- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మహాప్రభు జగన్నాథ్’ చిత్ర వివాదం.. విడుదలకు సుప్రీంకోర్టు అనుమతి
వివాదాస్పద యానిమేషన్ చిత్రం ‘మహాప్రభు జగన్నాథ్’ విడుదలకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: అనూహ్యంగా వివాదాల్లో చిక్కుకున్న యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ మహాప్రభు జగన్నాథ్ (Mahaprabhu Jagannath) థియేట్రికల్ విడుదలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) పర్మీషన్ ఇచ్చింది. అయితే, పూరీ (Puri)లో ప్రస్తుతం జరుగుతున్న జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలు ముగిసిన తర్వాతే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని స్పష్టం చేసింది. తాజాగా చిత్ర విడుదలను నిలిపివేస్తూ ఒడిశా హైకోర్టు అంతకు ముందు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. రథయాత్ర ఉత్సవాలు జూలై 27తో ముగియనున్న నేపథ్యంలో.. మూవీని జూలై 28 లేదా ఆ తర్వాతే విడుదల చేయాలని జస్టిస్ బీవీ.నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం రియాక్ట్ అవుతూ.. యానిమేషన్ చిత్రాలు భక్తుల భక్తిని, విశ్వాసాన్ని తగ్గించలేవని కామెంట్ చేసింది. ఈ మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చిందని తెలిపింది. భక్తుల మతపరమైన భావాలను గౌరవిస్తూనే, సినిమా మేకర్స్ హక్కులను కాపాడటానికి రథయాత్ర ముగిసిన తర్వాత విడుదల చేయడమే సరైన మార్గమని కోర్టు అభిప్రాయపడింది. అయితే, మహాప్రభు జగన్నాథ్ యానిమేషన్ చిత్రంలో చూపించిన జగన్నాథుడి బాల్య విశేషాలు, యుద్ధ సన్నివేశాలు, కల్పిత సంభాషణలు, స్కాంద పురాణం, బ్రహ్మ పురాణాల్లోని పవిత్ర గ్రంథాలకు భిన్నంగా ఉన్నాయంటూ కొందరు భక్తులు ఒడిశా హైకోర్టులో పిల్ (PIL) దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. సినిమా విడుదలపై స్టే విధించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎలి యానిమేషన్స్’ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇవాళ అనకూలంగా తీర్పు వెలువడింది.






