- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన నమిత.. వావ్, సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
నమితకు సంబంధించిన ఒక క్రేజీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియోలో నమిత జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తూ కనిపించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ నటి నమిత సొంతం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి బాలయ్య సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్‌తో చేసిన బిల్లా, వెంకటేష్ సరసన జెమిని, బాలయ్యతో ‘సింహా’ వంటి చిత్రాలతో అమ్మడు రేంజ్ మారిపోయింది. తెలుగుతో పాటు తమిళంలోనూ అగ్ర నాయికగా వెలిగిన నమిత, తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని వెండితెరకు దూరం అయ్యారు. వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిన నమిత. పిల్లలు పుట్టిన తర్వాత గుర్తుపట్టలేనంతగా బరువు పెరిగారు. శారీరక మార్పుల వల్ల ఆమె పూర్తిగా సినిమాలకే కాకుండా సోషల్ మీడియాకు కూడా కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. అయినప్పటికీ, నెట్టింట తన బరువుపై వస్తున్న ట్రోల్స్‌కు, బాడీ షేమింగ్ కామెంట్స్‌కు మాత్రం ఆమె తనదైన శైలిలో గట్టిగానే కౌంటర్లు ఇస్తూ వచ్చారు.
ఇదిలా ఉంటే.. తాజాగా నమితకు సంబంధించిన ఒక క్రేజీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియోలో నమిత జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తూ కనిపించారు. అయితే, అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. గతంలో చాలా బొద్దుగా ఉన్న నమిత, ఎవరూ ఊహించని విధంగా విపరీతంగా బరువు తగ్గి చాలా స్లిమ్‌గా మారిపోయారు. ఆమె పట్టుదల, కష్టం చూసి అభిమానులతో పాటు నెటిజన్లు సైతం నోరెళ్లబెడుతున్నారు. బొద్దుగుమ్మగా సౌత్ ఇండియాను ఏలిన నమిత.. మళ్లీ పాత లుక్‌లోకి వచ్చేందుకు చేసిన ఈ ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త ఫిట్‌నెస్ వీడియోను చూసిన వారంతా వావ్ సూపర్ నమిత.. మీ డెడికేషన్‌కు హాట్సాఫ్ అంటూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.






