- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న రామ్ చరణ్.. ఆనందంలో మెగా ఫ్యాన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా మరో అరుదైన ఘనత సాధించారు.

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా మరో అరుదైన ఘనత సాధించారు. జూన్ 16–30 మధ్యకాలానికి సంబంధించిన మోస్ట్ పాపులర్ ఇండియన్ పర్సనాలిటీస్ లిస్ట్‌లో రామ్ చరణ్ నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇది ఆయనకు ఉన్న అద్భుతమైన క్రేజ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ ఫ్యాన్ బేస్‌కు నిదర్శనం కావడంతో.. ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మోస్ట్ పాపులర్ ఇండియన్ పర్సనాలిటీస్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్ రామ్ చరణ్ సొంతం చేసుకోగా.. సెకండ్ ప్లేస్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు. మూడో స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉండగా.. నాలుగో స్థానంలో కన్నడ స్టార్ యష్ ఉన్నాడు. ఇక షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఐదు, ఆరు ప్లేసులు సొంతం చేసుకోగా.. ఏడు, ఎమిదిలో జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దళపతి ఉన్నారు. తొమ్మిదో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 10వ స్థానంలో క్రికేటర్ ఎమ్ఎస్ ధోనీ నిలిచారు. ప్రస్తుతం ఈ లిస్ట్‌కు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది.






