వ్యక్తి అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి

by Kodari Anjali |   (  Updated:2026-07-17 10:39:45  IST  )

మల్కాజిగిరి పరిధికి చెందిన ఓ ఆటో డ్రైవర్ అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వ్యక్తి అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి
X

దిశ, మల్కాజిగిరి: మల్కాజిగిరి పరిధికి చెందిన ఓ ఆటో డ్రైవర్ అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం, జి. అశోక్ తన బంధువు ఎస్. మారుతి (31) అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. న్యూ మిర్జాలగూడకు చెందిన మారుతి (తండ్రి: కిషన్) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఈ నెల 14/15 జూలై అర్ధరాత్రి కిరాయి ఆటో TS10 UA 8351తో వెళ్లిన మారుతి, రాత్రి 12:30 గంటల సమయంలో ఎల్పీజీ గ్యాస్ స్టేషన్ సమీపం నుంచి ఫోన్ చేసి ఆటోలో గ్యాస్ అయిపోయిందని, రూ.100 పంపించాలని కోరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత నుంచి అతడి ఆచూకీ తెలియరాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ జితేందర్ సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మారుతి ఆచూకీ గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే 8712578721, 8712662691, 8341479923 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Next Story