మరో భారీ ఈవెంట్‌కు సిద్ధమైన 'లెనిన్' మేకర్స్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

by Pulgam srinivas |

లెనిన్ తదుపరి కార్యక్రమానికి చైతూ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తుంది.

మరో భారీ ఈవెంట్‌కు సిద్ధమైన లెనిన్ మేకర్స్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ తాజాగా 'లెనిన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. శివాజీ, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. జూలై 10న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే పలు విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించింది.

తాజాగా మరో గ్రాండ్ ఈవెంట్‌కు కూడా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో ఆయన చేతుల మీదుగా చిత్ర బృందానికి సక్సెస్ షీల్డ్స్ అందజేయనున్నట్లు సమాచారం. అఖిల్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ, ఈ చిత్రంతోనే ఆయనకు భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో ఆయన తదుపరి చిత్రం ఎవరితో ఉండబోతోందనే ఆసక్తి అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా నెలకొంది.

Next Story