- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన సీడీపీవో సుజాత
సదాశివ నగర్ మండలంలోని ఉత్తనూర్ గ్రామంలో, రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామంలో గల అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం సీడీపీఓ సుజాత ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ, సదాశివ నగర్: సదాశివ నగర్ మండలంలోని ఉత్తనూర్ గ్రామంలో, రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామంలో గల అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం సీడీపీఓ సుజాత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా టీచర్లు కృషి చేయాలని ఆమె టీచర్లకు హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెంచకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందించాలన్నారు. పిల్లలకు వండిన భోజనాన్ని ఆమె పరిశీలించారు. పిల్లలకు క్రమశిక్షణతో పాటు, ఆట వస్తువులతో పిల్లలకు ఆటలు పాటలు నేర్పించాలన్నారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ సుజాత, రామారెడ్డి సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్లు సుజాత, జ్యోతి, రాజమణి, విజయ ఆయాలు పాల్గొన్నారు. రామారెడ్డి మండల పరిధిలో ఉన్న అంగన్వాడీ ఆయా విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో శుక్రవారం ఐసిడిఎస్ సిడిపిఓ సుజాత షోకాజ్ నోటీసు జారీ చేశారు.






