- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హామీల గురించి ప్రశ్నిస్తామనే భయంతోనే అనుమతి నిరాకరణ.. బీఆర్ఎస్ ఫైర్
సరూర్‌నగర్ బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై శంబీపూర్ రాజు, సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘యువ సంగ్రామ సదస్సు’కు పోలీసులు అనుమతి నిరాకరించడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
గత నెలలోనే దరఖాస్తు: శంబీపూర్ రాజు:
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు మాట్లాడుతూ.. యువ సంగ్రామ సదస్సు కోసం గత నెలలోనే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నామని, కలెక్టర్ అనుమతి లేఖ ఆధారంగా స్పోర్ట్స్ అథారిటీకి సమాచారం ఇచ్చామన్నారు. జూలై 8న సీపీకి అధికారికంగా లేఖ అందజేసి పోలీసులు కోరిన విధంగా సీసీ కెమెరాల ఏర్పాటు, డీడీల చెల్లింపులు వంటి అన్ని నిబంధనలను పాటించినప్పటికీ చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తాను చేసిన ఫోన్ కాల్స్‌కు కూడా సీపీ స్పందించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సభకు అనుమతి ఇవ్వవద్దని పోలీసు అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువ సంగ్రామ సదస్సు విజయవంతమవుతుందని, యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. అనుమతి నిరాకరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వెల్లడించారు.
నిరుద్యోగుల గొంతు నొక్కే కుట్ర: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 30న దరఖాస్తు చేసినా జూలై 18 వచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. ఎన్నికల వేళ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పించి.. ఇప్పుడు నిరుద్యోగులను నట్టేట ముంచారు. వయోపరిమితి సడలింపు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రశ్నిస్తున్న విద్యార్థులపై దమనకాండ సాగిస్తున్నారు. యువత పెద్ద ఎత్తున సభకు హాజరైతే ఎక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందోననే భయంతోనే రేవంత్ సర్కార్ సభను అడ్డుకుంటోందని అని విమర్శించారు. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే సరూర్‌నగర్ స్టేడియం వద్దే నిరసన తెలుపుతామని హెచ్చరించారు.






