NEET (UG) పేపర్ లీక్ కేసు.. సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

నీట్ యూజీ (NEET UG) పేపర్ లీక్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

NEET (UG) పేపర్ లీక్ కేసు.. సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET UG) పేపర్ లీకేజీ కేసులో విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేసులో అరెస్టు అయిన నిందితులు దినేష్ బివాల్ (Dinesh Bival), వికాస్ బివాల్ (Vikas Bival) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. నిందితులు బెయిల్ దరఖాస్తులపై లిఖితపూర్వక సమాధానాన్ని సీల్డ్ కవర్‌లో సమర్పించాల్సిందిగా కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)ని ధర్మాసనం ఆదేశించింది. నిందితుల బెయిల్ పిటిషన్లపై సీబీఐ ఇచ్చే సమాధానం, ఇరుపక్షాల లాయర్ల వాదోపవాదాలను వినేందుకు వీలుగా రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 23కి వాయిదా వేసింది. ఈ లోపు నిందితుల బెయిల్‌పై తమ అభ్యంతరాలను, వాదనలను సిద్ధం చేసుకోవాలని సీబీఐ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

Next Story