- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులను కడుపులో పెట్టి చూసుకోవాలి : ఎమ్మెల్యే సునీత
తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులను కడుపులో పెట్టి చూసుకోవాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వార్డెన్లకు సూచించారు.

దిశ, నర్సాపూర్ : తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులను కడుపులో పెట్టి చూసుకోవాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వార్డెన్లకు సూచించారు. శుక్రవారం నర్సాపూర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సలహా సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ ఏ ఎస్ సి డబ్ల్యూఓ శేషాచారి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీరాజు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 17 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు ఉన్నాయని, ఈ వసతి గృహాల్లో అడ్మిషన్లను చేర్చుకోవడమే కాకుండా ఈ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 100% ఉత్తీర్ణత సాధించేందుకు వార్డెన్లు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని కొల్చారం, గోమారం, హత్నూర లాంటి ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరుకున్న హాస్టల్లో భవనాలకు మరమ్మతులకు గాను నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు ప్రభుత్వంతో చర్చించి నూతన భవనాలను మంజూరు చేయించుటకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వసతులను ఆమె గుర్తు చేశారు. విద్యార్థులకు మెరుగైన భోజనంతో పాటు ప్రతి ఏటా కాస్మోటిక్ ఛార్జీలు దుస్తులు బెడ్ షీట్లు నోట్ బుక్స్ అందుతున్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎక్కడైనా హాస్టల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని సూచించారు. ఈ సందర్భంగా హాస్టల్లో వార్డెన్లు ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ సి డబ్ల్యూ ఓ శేషాచారి, ఏ బి సి డబ్ల్యూ ఓ గంగ కిషన్, ఏ ఎస్ సి డబ్ల్యూ ఓ పద్మజ, ఏ బి సి డి ఓ అమర జ్యోతి, ఎంఈఓ తారా సింగ్, ఎంపీడీవో ఉమాదేవి, నియోజకవర్గ స్థాయి హాస్టల్ వార్డెన్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






