- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబులెన్స్‌లోనే సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి అంబులెన్స్‌లోనే గర్భిణికి సురక్షితంగా ప్రసవం నిర్వహించి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడారు.

దిశ, కనగల్ : 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి అంబులెన్స్‌లోనే గర్భిణికి సురక్షితంగా ప్రసవం నిర్వహించి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడారు. చండూరు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన టేకుల కుశల (22)కు గురువారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే కనగల్ 108 అంబులెన్స్‌లో ఈఎంటీ మండలి సత్యనారాయణ, పైలట్ రాంబాబు గ్రామానికి చేరుకుని గర్భిణిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో ప్రసవ నొప్పులు తీవ్రం కావడంతో ఆసుపత్రి వైద్యుల సూచనల మేరకు అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించారు. కుశల పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చేర్పించారు. అత్యవసర పరిస్థితిలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షిత ప్రసవం నిర్వహించిన ఈఎంటీ మండలి సత్యనారాయణ, పైలట్ రాంబాబు సేవలను వైద్యాధికారులు, గ్రామస్థులు అభినందించారు.






