బాన్సువాడలో పంట పొలంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

by Ratna Kumari |

బాన్సువాడ పట్టణంలోని ఫిల్టర్ బెడ్ సమీపంలోని పంట పొలంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

బాన్సువాడలో పంట పొలంలో వ్యక్తి అనుమానాస్పద మృతి
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని ఫిల్టర్ బెడ్ సమీపంలోని పంట పొలంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన దేశాయిపేట్ నారాయణ పాత బాన్సువాడకు చెందిన గురు సిద్ధేశ్వర్‌కు చెందిన పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. గురువారం రాత్రి భోజనం చేసిన అనంతరం రాత్రి 10 గంటల సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన నారాయణ తిరిగి ఇంటికి రాలేదు.

శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన భార్య దేశాయిపేట్ సుజాత పొలం వద్దకు వెళ్లి చూడగా, నారాయణ బోర్లాపడి మృతి చెందిన స్థితిలో కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ తెలిపారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story