నగదు రహిత వైద్యం చారిత్రాత్మక నిర్ణయం.. ప్రభుత్వానికి జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి కృతజ్ఞతలు

by Gantepaka Srikanth |

ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత కల్పించడం హర్షణీయమని ఉద్యోగుల జేఏసీ చైర్మన్, ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ మెంబర్ వి.లచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు.

నగదు రహిత వైద్యం చారిత్రాత్మక నిర్ణయం.. ప్రభుత్వానికి జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి కృతజ్ఞతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత కల్పించడం హర్షణీయమని ఉద్యోగుల జేఏసీ చైర్మన్, ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ మెంబర్ వి.లచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు. నగదు రహిత వైద్య సేవలు చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల తరుపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన, నగదు రహిత వైద్య సేవలను అందించాలనే సంకల్పంతో ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ అమలుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. హెల్త్ స్కీమ్ పథకం రూపకల్పన, అమలులో విశేష కృషి చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆరోగ్య భరోసా పెరుగుతుందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంక్షేమానికి ఇదే స్ఫూర్తితో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రాములు, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బాణాల రాంరెడ్డి, రమేష్ పాకా, రాధ, ఫూల్‌సింగ్, నిర్మల, బిక్షం, ఉపేందర్ రావులతో పాటు వివిధ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు, జేఏసీ నాయకులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story