- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ లిక్కర్ స్కాం కేసు: నిందితుల కస్టడీలో కీలక విషయాలు
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరరెడ్డి, కారుమూరి సునీల్ ను ఈడీ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ముగ్గురు నిందితులను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరరెడ్డి, కారుమూరి సునీల్ ను ఈడీ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ముగ్గురు నిందితులను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్ విక్రయాల్లో భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగానే సిగ్మా సంస్థకు కాంట్రాక్టు గడువు పొడిగించినట్లు అధికారులు తేర్చారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం జరిగినట్లు నిర్ధారించారు. అంతేకాదు ఈ కుట్రకు రాజ్ కసిరెడ్డి రూపకల్పన చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. గత విచారణలోనూ కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. రూ. 135 కోట్లు గండికొట్టినట్లు ఏపీ సిట్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈడీ అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గురువారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. శుక్ర, శనివారల్లోనూ విచారణ కొనసాగిస్తున్నారు. అనంతరం నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.






