సాగునీటి కోసం బీఆర్ఎస్ మహాధర్నా

by Taduka Kalyani |   (  Updated:2026-07-17 09:23:46  IST  )

రైతులకు సాగునీరు అందించాలి..గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద మహా ధర్నా నిర్వహించారు.

సాగునీటి కోసం బీఆర్ఎస్ మహాధర్నా
X

దిశ, ములుగు: రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌తో పాటు కాళేశ్వరం పరిధిలోని అన్ని రిజర్వాయర్లను వెంటనే నీటితో నింపాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద మహా ధర్నా నిర్వహించారు. గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ ధర్నాలో సుమారు రెండు వేల మంది రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ… వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు సాగునీరు అందించడం ప్రభుత్వ తొలి బాధ్యత అని అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీటిని విడుదల చేసి కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌తో పాటు అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దీంతో సాగునీటి కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో రైతులకు ఎలాంటి సాగునీటి కొరత లేకుండా ప్రాజెక్టులను సమర్థంగా నిర్వహించామని, ప్రస్తుతం అదే వ్యవస్థను వినియోగించకపోవడం వల్ల రిజర్వాయర్లు ఖాళీగా మారుతున్నాయని ఆరోపించారు. వర్షాకాలంలో తగిన వర్షాలు లేకపోవడం తెలిసినా రైతులకు నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే సాగునీటిని విడుదల చేసి సమస్యను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ చందన రవి,మర్కుక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి, దేవి రవీందర్, మాజీ ఎంపీపీ పాండు గౌడ్, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం, బల్‌రెడ్డి, బుల్లె రాణి మల్లేష్, కనకయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు

Next Story