పల్నాడులో పారిశ్రామిక విప్లవం రావాలి... పేదరికం పోవాలి: చంద్రబాబు

by Ajay Maddhiboyina |

ప‌ల్నాడు జిల్లాలో పారాల్సింది ర‌క్తం కాద‌ని, ప‌ల్నాడులో పారిశ్రామిక విప్ల‌వం రావాల‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. చంద్రబాబు నేడు పల్నాడులోని నరసారావుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

పల్నాడులో పారిశ్రామిక విప్లవం రావాలి... పేదరికం పోవాలి: చంద్రబాబు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప‌ల్నాడు జిల్లాలో పారాల్సింది ర‌క్తం కాద‌ని, ప‌ల్నాడులో పారిశ్రామిక విప్ల‌వం రావాల‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. చంద్రబాబు నేడు పల్నాడులోని నరసారావుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్క‌డ పేద‌రికం పోవాల‌ని, దానికి ప్ర‌భుత్వం ముందు ఉంటుంద‌ని చెప్పారు. ప‌ల్నాడు జిల్లా రుణాల పంపిణీలో ముందుంద‌ని చెప్పారు. 84,893 మంది రైతుల‌కు రూ.2,363 కోట్ల రుణాలు ఇచ్చామ‌ని చెప్పారు. MSMEలకు 4,449 యూనిట్లకు రూ.335 కోట్లు ఇచ్చామ‌ని అన్నారు. గృహం, విద్య, వాహనం, సౌర విద్యుత్ కోసం 15,228 ఖాతాలకు రూ.624 కోట్లు మంజూరు చేసిన‌ట్టు తెలిపారు.

15,000 మంది DWCRA మహిళలు, 13,355 మంది పారిశ్రామిక వేత్తలకు రుణాలు ఇచ్చామ‌ని అన్నారు. బ్యాంకులు కేవ‌లం రుణాలు ఇచ్చే సంస్థ‌లు కాద‌ని రాష్ట్ర అభివృద్ధిలో భాగ‌స్వాములు అని తెలిపారు. గత ఏడాది లక్ష మంది ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తలను తయారు చేశామని, ఈ ఏడాది 5 లక్షల మందిని ఎంఎస్‌ఎంఈలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో పారిశ్రామికవేత్త కావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అది ఆడబిడ్లలతోనే మొదలు కావాలన్నారు. ఇప్పటికే రుణాల పంపిణీలో ఏపీ దేశంలోనే నంబర్ 1గా ఉందన్నారు. దేశంలో ఎక్కువగా డబ్బులు తీసుకున్న రాష్ట్రం ఏపీనే అని అన్నారు. ఎవరైనా రుణాలు తీసుకుంటే 99.9 శాతం కట్టే పరిస్థితికి వచ్చారని తెలిపారు.

Next Story