- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12 రోజులైనా గ్యాస్ సిలిండర్ లేదు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

దిశ,రాజోలి: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసి 12 నుంచి 13 రోజులు గడిచినా ఇంకా డెలివరీ కావడం లేదని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీకి పలుమార్లు ఫోన్ చేసినా సరైన సమాచారం ఇవ్వడం లేదని, సిలిండర్ ఎప్పుడు వస్తుందో స్పష్టత లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పోస్టుల్లో పేర్కొంటున్నారు.
ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు వంట చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో కట్టెలు, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. రాజోలి గ్రామానికే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గృహ అవసరాలకు అత్యంత కీలకమైన గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందకపోవడం వల్ల ప్రజల నిత్యజీవనం అస్తవ్యస్తమవుతోందని, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి సకాలంలో గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, వినియోగదారులు కోరుతున్నారు.






