తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. కలర్ పాపడాలపై నిషేదం

by Ajay Maddhiboyina |

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో రంగు రంగుల పాప‌డాల‌పై నిషేదం విధించింది. పాప‌డాల‌లో ప్ర‌మాద‌క‌ర‌మైన రోడ‌మైన్ బి ర‌సాయ‌నాల‌ను క‌లిపిన‌ట్టు అధికారులు గుర్తించారు.

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. కలర్ పాపడాలపై నిషేదం
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో రంగు రంగుల పాప‌డాల‌పై నిషేదం విధించింది. పాప‌డాల‌లో ప్ర‌మాద‌క‌ర‌మైన రోడ‌మైన్ బి ర‌సాయ‌నాల‌ను క‌లిపిన‌ట్టు అధికారులు గుర్తించారు. ఈ ర‌సాయ‌నాలు క్యాన్స‌ర్ కు కార‌ణం అవుతాయ‌ని నిర్ధారించారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం వీటిపై బ్యాన్ విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. నిబంధ‌న‌లు ఉల్లంఘించి విక్ర‌యాలు జ‌రిపితే దుకాణాల‌ను సీజ్ చేస్తామ‌ని, చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. కృత్రిమ రంగులు క‌లిపిన ఆహార ప‌దార్థాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

ఇక ఇప్పటికే మంచూరియాలో రంగులు క‌ల‌పడంపై ప‌లు రాష్ట్రప్ర‌భుత్వాలు నిషేదం విధించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా బిర్యానీ, పానీపూరీ ఇలా ఇత‌ర ఆహార ప‌దార్థాల‌లోనూ కృత్రిమ రంగుల‌ను వాడ‌వ‌ద్ద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ చాలాచోట్ల కృత్రిమ రంగుల వినియోగం ఆగ‌డంలేదు. కాబట్టి త‌మిళ‌నాడులో రంగుల పాప‌డాల‌పై బ్యాన్ విధించిన‌ట్టుగానే ఇత‌ర అనోరోగ్యానికి కార‌ణ‌మ‌య్యే ఆహార ప‌దార్థాల‌పై బ్యాన్ విధించాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story