- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుణుడి కరుణ కోసం ‘కప్ప కావడి’
మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మహిళలు సంప్రదాయబద్ధంగా ‘కప్ప కావడి’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

దిశ, నవాబుపేట: మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మహిళలు సంప్రదాయబద్ధంగా ‘కప్ప కావడి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక కట్టెకు రెండు కప్పలు కట్టి వాటిపై పసుపు, కుంకుమ, వేపాకులు అలంకరించి, కప్పలకు ఎలాంటి హాని కలగకుండా ఇంటింటి మహిళలతో వాటిపై నీళ్లు పోయిస్తూ “రామోజీ రామా..” అంటూ భక్తి గీతాలు ఆలపిస్తూ భిక్షాటన చేపట్టారు. భిక్షాటనలో భాగంగా సేకరించిన విరాళాలతో పదార్థాలు కొనుగోలు చేసి వరద పాశం తయారు చేసి చెరువు కట్టపై వరుణ దేవుడికి నైవేద్యంగా సమర్పించారు.
అనంతరం కప్పలకు ప్రతీకాత్మకంగా పెళ్లిళ్లు జరిపి వాటిని తిరిగి చెరువులో వదిలిపెట్టారు. తర్వాత వరద పాశాన్ని ప్రసాదంగా గ్రామస్థులకు పంచిపెట్టారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ గ్రామీణ ఆచారం ద్వారా ప్రకృతి అనుకూలించి సమృద్ధిగా వర్షాలు కురవాలని, చెరువులు నిండాలని, పంటలు బాగా పండాలని, రైతుల కష్టాలు తొలగాలని మహిళలు మనస్ఫూర్తిగా ప్రార్థించారు. భక్తి, ప్రకృతి పరిరక్షణ, గ్రామీణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం గ్రామస్థులను విశేషంగా ఆకట్టుకుంది.






