సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు... ముగ్గురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్

by Vemula.Srinu Prasad |

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారనే అభియోగాలపై రోళ్ల మండలానికి చెందని ఇద్దరు, గుడిబండ మండలానికి చెందిన ఒకరిపై కేసు నమోదు చేశారు. ...

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు... ముగ్గురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారనే అభియోగాలపై రోళ్ల మండలానికి చెందని ఇద్దరు, గుడిబండ మండలానికి చెందిన ఒకరిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోషల్ మీడియాలో పోస్టుల వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం వారిని కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అంతకుముందు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

కొన్ని రోజులుగా...

కాగా కొన్ని రోజులుగా ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చిన కామెంట్లు, అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది. అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైసీపీకి చెందిన ఈ ముగ్గురిపై చర్యలకు దిగింది. ప్రస్తుతం ఈ ఘటన మడకశిరలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తమ పార్టీ వారిని అరెస్ట్ చేయడంతో స్థానిక వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు.

Next Story