తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం.. ఆ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

by Prasad Jukanti |   (  Updated:2026-07-17 11:26:39  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సాగునీటి ప్రాజెక్టులు, చట్టసవరణలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం.. ఆ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మంత్రివర్గ సమావేశం మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ భేటీ కొనసాగుతోంది. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్ కు దిశానిర్దేశం చేసేలా ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పలు ప్రాజెక్టులకు సవరించిన అంచనాలు ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వంటి పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతం, నీటి లభ్యత ఆధారంగా సాగునీటి సరఫరా అంశాలపై మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్టసవరణకు ఆమోదం తెలిపబోతున్నట్లు తెలుస్తోంది. పాలమూరు -రంగారెడ్డి, సీతారామ, దేవాదుల రీ ఎస్టిమేషన్స్ పై మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. అలాగే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో మెట్రో విస్తరణ విషయంలో కేందర్ వైఖరి, బుల్లెట్ ట్రైన్ అలైన్ మెంట్ల అంశంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Next Story