లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు

by Taduka Kalyani |

మహిళపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయ ప్రసాద్ తీర్పు వెల్లడించారు.

లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు
X

దిశ, బెజ్జంకి : మహిళపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయ ప్రసాద్ తీర్పు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెజ్జంకి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెజ్జంకి పోలీసులు స్టేషన్ పరిధిలో 2022 మార్చి 26వ తేదీన జంగపల్లి సంతోష్ పై లైంగిక దాడి కేసు నమోదైంది. నాటి దర్యాప్తు అధికారి సిద్దిపేట రూరల్ సీఐ వీ జానకి రాంరెడ్డి సమగ్ర దర్యాప్తు నిర్వహించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి న్యాయ స్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల ఆత్మరాములు వాదనలు వినిపించారు. ప్రస్తుత ఎస్సై టి. తిరుపతి, సీఐ విద్యాసాగర్ , లైజనింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి , సీడీఓ రవి, భరోసా లీగల్ అధికారి సౌమ్య సమన్వయంతో కేసు విచారణలో సహకారం అందించారని పేర్కొన్నారు. సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి వై. జయ ప్రసాద్ గారు నిందితుడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.37,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన అధికారులను, సిబ్బందిని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ అభినందించారు. సమాజంలో మహిళల భద్రతకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని, నేరస్తులకు శిక్ష పడేలా చేయడంలో రాజీ పడబోమని సీపీ స్పష్టం చేశారు.

Next Story