భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థి మృతి

by Jakkula.Mamatha |

బీటెక్ విద్యార్థి భవనంపై నుంచి దూకి మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంబీఆర్ నగర్‌లో గురువారం చోటుచేసుకుంది.

భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థి మృతి
X

దిశ, ఇబ్రహీంపట్నం: బీటెక్ విద్యార్థి భవనంపై నుంచి దూకి మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంబీఆర్ నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం సీఐ మద్ది మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా, కోర్వి మండలం, రాజోలు గ్రామానికి వాసుదేవ్(19) ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాగా, గురువారం రాత్రి 9.30 గంటలకు వాసుదేవ్ ఎంబీఆర్ నగర్‌లోని హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడాడు. అతని ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ప్రేమ వ్యవహారం కారణమై ఉండొచ్చని స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story