- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటించింది. అంతేకాదు ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ లేఖ విడుదల చేసింది....

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(Tollywood Dance Directors Association) సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటించింది. అంతేకాదు ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ లేఖ విడుదల చేసింది. అయితే ఖాళీ అయిన పోస్టులకు ఎన్నికలు నిర్వహించాలని మెజార్టీ సభ్యులు డిమాండ్లు చేశారు. దీంతో ఉప ఎన్నికలకు సిద్ధమైనట్లు ప్రకటన చేశారు. అంతేకాదు ఎన్నికల పోలింగ్ తేదీని కూడా ప్రకటించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
దీంతో 2025-2027 కార్యవర్గ ఎన్నికల ప్రక్రియను TFDDA ప్రారంభించింది. జులై 20న నామినేషన్లు దాఖలు స్వీకరించనున్నట్లు తెలిపింది. అలాగే ఎన్నికల అధికారి అదే రోజు నుంచి పరిశీలన చేయనున్నట్లు వెల్లడించింది. జులై 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుందని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఎన్నిలక నిబంధనల ప్రకారమే ఈ ఎలక్షన్స్ జరుగుతాయని స్పష్టం చేసింది.
అసోసియేషన్‌లో వివాదం
కాగా అసోసియేషన్‌లో జరిగిన వివాదం నేపథ్యంలో మొత్తం 10 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. అయితే మిగిలిన ఆరుగులు కూడా బై ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటించడంతో టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా స్వామ్య పద్ధతిలో ఎన్నికలకు వెళ్లాలని తాము నిర్ణయించుకున్నట్లు అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆదివారం మీటింగ్ ఉంటుందని, అప్పుడు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని అసోసియేషన్ తెలిపింది. అయితే రెండు రోజుల ముందుగానే తమ అభిప్రాయాన్ని ప్రకటించడం ప్రస్తుతం చర్చగా మారింది.






