- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మౌనీరాయ్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన నటుడు.. పోస్ట్ వైరల్
అయితే విడాకుల తర్వాత నుంచి ‘నాగిన్’ సీరియల్ జోడీ అర్జున్ బిజ్లానీ, మౌనీ రాయ్ ల మధ్య డేటింగ్ నడుస్తోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ ఇటీవల తన భర్త సూరజ్ నంబియార్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు తమ నాలుగేళ్ల బంధానికి ఎండ్ కార్డ్ వేసి అధికారికంగా విడాకుల ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పరస్పర అవగాహనతోనే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నామని, ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని వారు ప్రకటనతో కోరారు. ఇక భర్తతో విడిపోయిన తర్వాత మౌనీరాయ్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే విడాకుల తర్వాత నుంచి ‘నాగిన్’ సీరియల్ జోడీ అర్జున్ బిజ్లానీ, మౌనీ రాయ్ ల మధ్య డేటింగ్ నడుస్తోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల వీరిద్దరూ ఒక డిన్నర్ పార్టీలో కలిసి కనిపించడమే ఈ పుకార్లకు కారణం. అందుకే తన భర్తకు విడాకులు ఇచ్చిందని.. నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా, ఈ రూమర్లపై నటుడు అర్జున్ బిజ్లానీ పోస్ట్ ద్వారా రియాక్ట్ అయ్యారు. తమ మధ్య ఉన్న పదిహేనేళ్ల స్వచ్ఛమైన స్నేహాన్ని తప్పుగా చిత్రీకరించవద్దని హెచ్చరిస్తూ ఒక ఘాటైన పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ డిలీట్ చేశారు. కానీ ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన పోస్ట్‌లో అర్జున్ క్లిక్‌బైట్ వెబ్‌సైట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేనేళ్లకు పైగా మంచి స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు, కేవలం ఏదో ఒక గాసిప్ పేజీ హెడ్‌లైన్ కోసం రాత్రికి రాత్రే ప్రేమికులుగా మారిపోరని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒక స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడటం సహజమని, అంతేకానీ ప్రతి స్నేహానికి వ్యూస్ కోసం ప్రేమ రంగు పులమాల్సిన అవసరం లేదని అన్నారు. వార్తలు రాసే ముందు కనీసం నిజానిజాలు తెలుసుకుంటే బాగుంటుందని చెబుతూ, బాధ్యతాయుతమైన జర్నలిజం నమ్మకాన్ని పెంచుతుందని, క్లిక్‌బైట్ వార్తలు కాదని మండిపడ్డారు.






