మైనర్ బాలిక పై అసభ్య ప్రవర్తన ఆరోపణ.. స్థానికుల దాడిలో వ్యక్తి మృతి

by Jakkula.Mamatha |

ఒక మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై స్థానికులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

మైనర్ బాలిక పై అసభ్య ప్రవర్తన ఆరోపణ.. స్థానికుల దాడిలో వ్యక్తి మృతి
X

దిశ, కార్వాన్: ఒక మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై స్థానికులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అజీజ్ అహ్మద్ అనే వ్యక్తి ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు అతడిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో అజీజ్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి అజీజ్ అహ్మద్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కుల్సుంపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story