తలకొండపల్లి మండల రైతులకు స్ప్రింక్లర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

by Jakkula.Mamatha |

తలకొండపల్లి మండలంలోని రైతులకు ప్రభుత్వం 100 స్ప్రింక్లర్లు మంజూరు చేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లింగరావుపల్లి గ్రామ సర్పంచ్ కాసు.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

తలకొండపల్లి మండల రైతులకు స్ప్రింక్లర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, తలకొండపల్లి: తలకొండపల్లి మండలంలోని రైతులకు ప్రభుత్వం 100 స్ప్రింక్లర్లు మంజూరు చేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లింగరావుపల్లి గ్రామ సర్పంచ్ కాసు.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఈ కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జూలై 27, 2026లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అలాగే అమనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలోని అమనగల్, తలకొండపల్లి, మాడ్గుల్, కడ్తాల మండలాలకు మొత్తం 400 స్ప్రింక్లర్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో ప్రతి మండలానికి 100 చొప్పున కేటాయించినట్లు వెల్లడించారు.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:

ల్యాండ్ పాస్‌బుక్

ఆధార్ కార్డు

బ్యాంక్ ఖాతా జిరాక్స్

ఆర్‌ఓఆర్ (ROR) జిరాక్స్

రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

డీడీ వివరాలు: పేరు: District Horticulture and Sericulture Officer, Rangareddy District

మొత్తం: రూ.9,000

రైతులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాసు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story