- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇలాంటి తప్పు ఎవరు చేయొద్దు’.. క్షమాపణలు చెప్పిన రీల్స్ యువకుడు
గాంధీ ఆస్పత్రిలో డిజిటల్ బీపీ మెషిన్‌తో రీల్ రూపొందించి వివాదంలో చిక్కుకున్న హయత్‌నగర్‌కు చెందిన గుర్రం వరుణ్(19) మరో వీడియో విడుదల చేసి క్షమాపణలు కోరాడు.

దిశ, సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో డిజిటల్ బీపీ మెషిన్‌తో రీల్ రూపొందించి వివాదంలో చిక్కుకున్న హయత్‌నగర్‌కు చెందిన గుర్రం వరుణ్(19) మరో వీడియో విడుదల చేసి క్షమాపణలు కోరాడు. తాను చేసిన తప్పుకు తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, ఇలాంటి రీల్స్ ఎవరూ చేయవద్దని యువతకు విజ్ఞప్తి చేశాడు. గతంలో తన తాతకు గాంధీ ఆస్పత్రిలో బీపీ పరీక్ష చేయలేదంటూ డిజిటల్ బీపీ మెషిన్ తీసుకుని రీల్ రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో చిలకలగూడ పోలీసులు వరుణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. గతంలో తన పిన్ని ప్రాణాపాయ స్థితిలో ఉండగా ప్రైవేటు ఆస్పత్రులు చేర్చుకోకపోయినా గాంధీ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారని గుర్తు చేశాడు. సరదాగా చేసిన రీల్ ఇంత పెద్ద వివాదానికి దారితీస్తుందని తాను ఊహించలేదని, తన చర్యపై చింతిస్తున్నట్లు తెలిపాడు. అనంతరం గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోనే మరో క్షమాపణ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వరుణ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణిని కలిసి వ్యక్తిగతంగా క్షమాపణలు కోరాడు. ఈ ఘటనపై న్యాయ నిపుణుల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ తెలిపారు.






