బాలిక అదృశ్యం ఘటన.. కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి

by Jakkula.Mamatha |

కేజీబీవీ ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం పై జిల్లా విద్యాధికారి విజయ కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాలిక అదృశ్యం ఘటన.. కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి
X

దిశ, మిడ్జిల్: కేజీబీవీ ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం పై జిల్లా విద్యాధికారి విజయ కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం కేజీబీవీ నుండి 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక సాయంత్రం సమయంలో కేజీబీవీ విద్యాలయం నుంచి వెళ్లిపోయిన సంఘటనపై విచారణ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే వసతి గృహంలో ఉండవలసిన అమ్మాయి ఎలా బయటికి వెళ్లిపోయిందని ప్రశ్నించారు. బాలికలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఎక్కడ అని అన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేజీబీవీ ఖాళీగా ఉన్న వంట మహిళల పోస్టులను, డే వాచ్ మెన్ పోస్టులు వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని తహసీల్దార్ రాఘవేందర్ రెడ్డి, ఎంఈఓ సరస్వతి కి ఆదేశించారు. వసతి గృహంలో బాత్రూంలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు ఉపాధ్యాయుల పనితీరు పై విచారణ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story