- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నేతల షో రూమ్‍లలో నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లండి..బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
విద్యార్థులపై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్‍ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తాము అధికారంలోకి వస్తే కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి విమర్శించారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్న హామీ మేరకు కాంగ్రెస్ నేతలకు చెందిన షో రూమ్‍లలో స్కూటీలు ఎత్తుకెళ్లాలన్నారు. ఇవాళ నిజామాబాద్ ఫీజురియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని 'ఇందూర్ రణభేరి' లో మాట్లాడిన రాశేక్ రెడ్డి.. ఉచితంగా స్కూటీలు ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఇప్పుడు నేను చెబుతున్నా విద్యార్థినులు కాంగ్రెస్ నేతల షో రూమ్‍లలోని స్కూటీలు ఎత్తుకెళ్లాలని రాకేశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
అగ్గిరాజేస్తాం:
ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చే వరకు ఊరుకోబోయేది లేదని, నిజామాబాద్ గడ్డపై పుట్టిన అగ్గి రాష్ట్రమంతటా రాజేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్ మెంట్ ఫైల్ పైనే బీజేపీ సీఎం తొలి సంతకం పెట్టబోతున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‍కు ఎలాంటి ఢోకా లేదని విద్యార్థులకు అండగా బీజేపీ నిలుస్తుందన్నారు. అవసరం అయితే చలో కొండారెడ్డి పల్లి, కొడంగల్ కార్యక్రమం తీసుకుంటామన్నారు.
ఎండ్రిన్ తాగమంటారా?
ఉద్యోగాలు ఇవ్వమన్న మా నిరుద్యోగులు ఎండ్రిన్ తాగమని, బావిలో దూకమని అంటారా? అని మండిపడ్డారు. ఈ బిడ్డలను మీరు కన్నారా పెంచారా? అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన మనువడి కోసం 20 వేల కోట్లు పెట్టి ఫుట్ బాల్ స్టేడియం కట్టారు. మరి పేదల తాతలు, తండ్రులు ఏం కావాలని ప్రశ్నించారు. పేదలు చదవద్దని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నీళ్లు అడిగితే రక్తం పారిస్తామంటున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతల రక్తం, కొవ్వు కరిగించాలని రైతుల ఎదురు చూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి.. అహంకారం తలకెక్కిందా అని ప్రశ్నించారు.






