- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఘోర ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్(ORR) అండర్‌బ్రిడ్జి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

దిశ,మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్(ORR) అండర్‌బ్రిడ్జి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సుమారు 11:50 గంటల సమయంలో కొంపల్లి వైపు వెళ్లే మార్గంలో కంద్లకోయ ORR అండర్‌బ్రిడ్జి వద్ద (TS08GU9850) నంబర్ గల పియాజియో ఏప్రిలియా ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో సొహైల్(18), సుమిత్ గైక్వాడ్(17) తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందారు.
మృతుడు సొహైల్ దిల్‌కుష్‌నగర్‌లోని ఎస్.వి. మోడల్ హైస్కూల్ ప్రాంతానికి చెందినవాడిగా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కాగా, మరో మృతుడు సుమిత్ గైక్వాడ్ కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ప్రమాదానికి కారణమై అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని, దీనిపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






