- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి
by Ratna Kumari |
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు.

X
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం భువనగిరి మండలంలోని బస్వాపురం ప్రాజెక్టులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు చేపల వేట కోసం బస్వాపురం ప్రాజెక్టుకు వెళ్లారు. ఈ క్రమంలో వారిలో ఒకరైన నయీం ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రాజెక్టు నుంచి వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






