- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
by Batti.Sumithra |
నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చంద మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

X
దిశ, లక్ష్మణ్‌చంద : నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చంద మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం చొప్పరి భీమన్న ఇంట్లో జరిగిన ఓ కుటుంబ వేడుకకు ఆయన బంధువులైన ఖానాపూర్ గ్రామానికి చెందిన పంబాల దినేష్, వీనేష్‌లు వచ్చారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో వీనేష్ కాలకృత్యాల నిమిత్తం ధర్మారం వైపు వెళ్లి తిరిగి లక్ష్మణ్‌చంద గ్రామానికి వస్తుండగా గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లక్ష్మణ్‌చంద గ్రామానికి చెందిన సల్కం అరుణ్ నడుపుతున్న సుప్రా వాహనం అతని మోటార్‌సైకిల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వీనేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రావణి తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు.
Next Story






