- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భాగ్యనగరానికి మరో గ్లోబల్ రికార్డు.. ‘మోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ’ ఎయిర్‌పోర్టుగా హైదరాబాద్
హైదరాబాద్ విమానాశ్రయానికి గ్లోబల్ లెవెల్లో అరుదైన గుర్తింపు దక్కింది.

దిశ, వెబ్‌డెస్క్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే మోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. యూకే (UK) కు చెందిన ప్రముఖ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ ప్రొవైడర్ ‘AttractionTickets.com’ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో ఈ గుర్తింపు లభించింది. ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న కేవలం రెండు భారతీయ విమానాశ్రయాలలో హైదరాబాద్ ఒకటి కావడం విశేషం.
140 విమానాశ్రయాల గుర్తింపు..
అయితే, వరల్డ్‌వైడ్‌గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కంటే ఎక్కువ విమానాశ్రయాలను పరిశీలించి ‘హ్యాపియెస్ట్ ఎయిర్‌పోర్ట్స్ ర్యాంకింగ్’ (Happiest Airports Ranking) పేరిట ఈ జాబితాను రూపొందించారు. మే 2026లో సేకరించిన డేటా ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. కుటుంబ సమేతంగా ప్రయాణించే వారికి అవసరమైన సదుపాయాలు, భద్రత, సమర్థత వంటి 9 కీలక అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 పాయింట్లకు గానూ 18.5 స్కోరును సాధించి ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది.






