- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిని రావణకాష్టం చేస్తారా..: మాజీ మంత్రి అంబటి
అమరావతి రాజధానిని రావణకాష్టం చేస్తారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాజధాని భూముల సేకరణలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్‌పై నిలదీసిన మహిళా రైతులను పోలీసులతో తోయించేశారని అంబటి ఆరోపించారు. ...

దిశ, వెబ్ డెస్క్: అమరావతి రాజధానిని రావణకాష్టం చేస్తారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాజధాని భూముల సేకరణలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్‌పై నిలదీసిన మహిళా రైతులను పోలీసులతో తోయించేశారని అంబటి ఆరోపించారు. ఏడాది తిరిగితే పూలింగ్ కు భూములిచ్చిన రైతులు సైతం బయటకు వచ్చేస్తారని జోస్యం చెప్పారు. అమరావతి రైతుల భూములను పోలీసులతో బలవంతంగా ఖాళీ చేయించారని అంబటి మండిపడ్డారు. పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం అణిచివేస్తోందని ధ్వజమెత్తారు. సీఎం రమేశ్ ఎకరా రూ.5 కోట్ల చొప్పున భూమిని కొనుగోలు చేశారని ఆరోపించారు. రైతులకు మాత్రం అందులో సగం కూడా ఇవ్వలేదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లకు కోట్లకు కోట్లు ధారబోస్తున్నారని ఆరోపించారు. రైతులకు మాత్రం తీవ్రమైన అన్యాయం చేస్తున్నాని అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పూలింగ్ కు భూములివ్వని రైతులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపడుతోందన్నారు. రైతులపై కుట్ర ఏంటని ప్రశ్నించారు. రైతులపై బుల్డోజర్లు, పోలీసులను ప్రయోగించి పూలింగ్‌కు భూములు తీసుకుంటున్నారని అంబటి ఆరోపించారు.






