భోగాపురం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా.. ఇమిగ్రేషన్ చట్టం పరిధిలోకి తెస్తూ గెజిట్ విడుదల

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపునిచ్చింది.

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా.. ఇమిగ్రేషన్ చట్టం పరిధిలోకి తెస్తూ గెజిట్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి (Bhogapuram Airport) కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక గుర్తింపు లభించింది. ఈ ఎయిర్‌పోర్టును ‘ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం, 2025’ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదలైంది.

అయితే, కేంద్ర హోంశాఖ తాజా నోటిఫికేషన్ ప్రకారం దేశంలోని ప్రతిష్టాత్మక కేటగిరీ-1 అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు స్థానం లభించింది. ఈ ప్రత్యేక కేటగిరీలో భోగాపురం 39వ విమానాశ్రయంగా చేరడం విశేషం. ఈ గుర్తింపుతో ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైన తొలి రోజు నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడానికి, విదేశీ ప్రయాణికులకు నేరుగా ఇమిగ్రేషన్ సేవలు అందించడానికి సర్వం సిద్ధమైంది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన ఈ కీలక గుర్తింపుతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక, పర్యాటక రంగాలు మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. భోగాపురం నుంచి నేరుగా అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వస్తే.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రయాణికులకు, విదేశీ పెట్టుబడిదారులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది.

Next Story