- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. రూ.లక్ష జరిమానాతో సరిపెట్టిన పెద్దమనుషులు
మూడేళ్ల పసికందుపై జరిగిన అత్యాచార ఘటనలో స్థానిక పంచాయితీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పోలీసు, న్యాయ వ్యవస్థ పకడ్బందీగా పనిచేస్తున్నా.. అక్కడకక్కడ దిగ్భ్రాంతికరమైన ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఒక్కోసారి సమాజం ఎటువైవపు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా మూడేళ్ల పసికందుపై ఓ మృగాడు అత్యాచారానికి ఒడిగడితే.. న్యాయం చేయాల్సిన గ్రామ పెద్దలు సభ్యసమాజం తలదించుకునేలా పంచాయితీ చెప్పారు. నిందితుడికి కేవలం రూ.1 లక్ష జరిమానా విధించడమే కాకుండా.. ఆ వచ్చిన డబ్బుతో పంచాయితీ సభ్యులంతా కలిసి మద్యం, విందు (Liquor Party) చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని ఓ పంచాయతీ పరిధిలో కేవలం మూడేళ్ల వయసు ఉన్న ఓ చిన్నారిపై స్థానికంగా ఉండే సునీల్ లోహరా అనే వ్యక్తి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘోరాన్ని తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఊరిలోనే ఈ గొడవను సర్దుబాటు చేస్తామని, పోలీసుల వరకు వెళ్లకుండా తామే న్యాయం చేస్తామని స్థానిక పంచాయితీ పెద్దలు రంగంలోకి దిగారు. ఘటనపై విచారణ జరిపినట్లు నాటకమాడిన ఖాప్ తరహా పంచాయితీ పెద్దలు.. నిందితుడు తప్పు చేసినట్లు అంగీకరించాడని చెబుతూ.. అతడికి రూ.లక్ష జరిమానా విధించారు. అంతటితో ఆగకుండా, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఆ పంచాయితీ సభ్యులు, ఆ జరిమానా డబ్బును బాధితురాలి కుటుంబానికి ఇవ్వలేదు. ఆ డబ్బును వారి వద్దే పెట్టకుని.. ఆ రాత్రే అందరూ కలిసి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి విందులు, వినోదాలు చేసుకున్నారు.
అయితే, ఈ అమానవీయ ఘటనపై సమాచారం సామాజిక సంస్థలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ పసికందు జీవితాన్ని నాశనం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాల్సింది పోయి, జరిమానా పేరుతో వసూలు చేసిన డబ్బుతో మందు పార్టీలు చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యాచర ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, నిందితుడితో పాటు చట్టాన్ని అపహాస్యం చేసిన పంచాయితీ పెద్దలపై కూడా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






