బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల సింగరేణి భవిష్యత్ లేని సంస్థగా మారుతుంది: కేంద్రమంత్రి

by Kodari Anjali |

సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ఆదాయం తగ్గిపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల సింగరేణి భవిష్యత్ లేని సంస్థగా మారుతుంది: కేంద్రమంత్రి
X

దిశ, మణుగూరు: కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ హయాంలో 2.40 లక్షల కోట్ల రూపాయల బొగ్గు అవినీతి జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం సింగరేణి భరోసా యాత్ర సందర్భంగా మణుగూరు ఓసి టు వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పరాకాష్టగా కేటాయించిన బొగ్గు గనులను సుప్రీంకోర్టు వెనక్కు తీసుకుందని బొగ్గు గనులను బహిరంగ వేలం వేయాలని సుప్రీంకోర్టు చెప్పిన విధంగా నేటి ప్రధాని మోదీ గనులను వేలం వేసి ఇస్తున్నారన్నారు. 20 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ పై ప్రేమతో సింగరేణిను ఆదుకోవాలని వేలం లేకుండా తాడిచర్ల 2 బ్లాక్ ను సింగరేణి కు కేటాయించిందన్నారు. సింగరేణి లో రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ఆదాయం తగ్గిపోయి కార్మికులను కోల్పోతున్న తరుణంలో సింగరేణి ను కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. అన్ని కంపెనీలు వేలంలో మంచి బొగ్గు బ్లాక్ లను పొందుతుంటే కేవలం బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల సింగరేణి భవిష్యత్ లేని సంస్థగా మారుతుందని, దానిని కేంద్ర ప్రభుత్వం మారుస్తోందన్నారు. సింగరేణినీ గత ప్రభుత్వాలు డబ్బు కోసం ఓటు బ్యాంకు లాగానే చూశాయన్నారు. రెండు బ్లాక్ లు అప్పట్లో వేలానికి వస్తే సింగరేణి పాల్గొనకుండా కేసీఆర్ అడ్డుకున్నాడన్నారు.

ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న రాష్ట్ర ప్రజలపై..

విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు ఉత్పత్తి కోసం నైని బ్లాక్ ను సింగరేణి కు కేటాయించారన్నారు. నైని కోల్ బ్లాక్ కోసం ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడకుండా కేసీఆర్ ప్రధాని కావడం కోసం మాట్లాడుకున్న చరిత్ర ఉందన్నారు. సింగరేణిలో నాణ్యత పడిపోయిందని ఆరోపణలు వస్తున్నాయని ఆదాయం పడిపోతుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సమయంలో పెద్ద మనసుతో న్యాయ శాఖ అనుమతులతో మోదీ ప్రభుత్వం తాడిచర్ల2 బొగ్గు గనిని సింగరేణికు కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రోజు కూడా సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ ఒపీనియన్ తీసుకోవన్నారు. ఇప్పుడు సింగరేణిలో అవినీతి జరుగుతుందని కేటీఆర్, హరీష్ రావు లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని ఆ రోజు ఏం చేశారు అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే సింగరేణి ను కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలని గత ప్రభుత్వం సింగరేణిలో చేసిన అవినీతి ని బయట పెట్టాలన్నారు. గత ప్రభుత్వం పినుగులను తింటే ఇప్పుటి ప్రభుత్వం ఏనుగులను తింటుందన్నారు. బకాయి పడ్డ 56 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే సింగరేణికి చెల్లించాలన్నారు. మణుగూరు సింగరేణి ఓసీ టు డీప్ సైడ్ బ్లాక్ ను సింగరేణి కేటాయించే విధంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు, యూనియన్ల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Next Story