- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ధురంధర్’కు బిగ్ షాక్.. ఆ దేశంలో కోలుకోలేని దెబ్బ!
‘ధురంధర్’ సినిమాకు జపాన్ నిరాశ ఎదురైంది.

దిశ, వెబ్ డెస్క్: ధురంధర్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్తాన్ మధ్య గొడవల నేపథ్యంలో వచ్చిన ప్రతి సినిమా బంపర్ హిట్ అయ్యాయి. అదే తరహాలో వచ్చిన ఈ ధురంధర్ సినిమా రెండు పార్టులు మంచి విజయాన్ని సాధించాయి. అలాంటి ధురంధర్ సినిమాకు జపాన్ లో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన జపాన్ లో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తొలి రోజు 900 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి.
ఓవరాల్ గా తొలి 3 రోజులలో జపాన్ లోని టాప్-25 సినిమాల సరసన కూడా ధురంధర్ చోటు దక్కించుకోలేక.. చెత్త రికార్డు నమోదు చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఇండియాలో దాదాపు 3 వేల కోట్లు సాధించిన ధురంధర్, జపాన్ లో పెద్దగా కలెక్షన్స్ రాబట్టక పోవడంతో చిత్ర బృందం నిరాశకు గురైంది. కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఆ దేశంలో తొలి రోజు కేవలం 886 టికెట్లు బుక్ అయ్యాయి. అదే RRR సినిమాకు అత్యధికంగా 8230 టికెట్లు బుక్ కావడం గమనార్హం.






