టీజీ ఎడ్‌సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..

by Ramesh Naini |

రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ, యూజీ డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది.

టీజీ ఎడ్‌సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ, యూజీ డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు టీజీ సెట్స్ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి సోమవారం ఒక ప్రకటన షెడ్యూల్ వివరాలు వెల్లడించారు.

ఈ ప్రవేశాలకు సంబంధించి అర్హత సాధించిన అభ్యర్థులు జూలై 21 నుండి ఆన్‌లైన్ ద్వారా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఎడ్‌సెట్ అభ్యర్థులు https://edcetadm.tgche.ac.in వెబ్‌సైట్‌ను, పీఈసెట్ అభ్యర్థులు https://pecetadm.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కన్వీనర్ సూచించారు.

Next Story