ఉద్యోగాల పేరుతో టోకరా.. సర్పంచ్ అరెస్ట్, జైలుకు తరలింపు

by Batti.Sumithra |

అమాయక నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన మండలంలోని గుండాల గ్రామపంచాయతీ సర్పంచ్ సురేష్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు ఎస్ఐ శ్రీసాయి తెలిపారు.

ఉద్యోగాల పేరుతో టోకరా.. సర్పంచ్ అరెస్ట్, జైలుకు తరలింపు
X

దిశ, నార్నూర్ : అమాయక నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన మండలంలోని గుండాల గ్రామపంచాయతీ సర్పంచ్ సురేష్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు ఎస్ఐ శ్రీసాయి తెలిపారు. ఎస్ఐ శ్రీసాయి తెలిపిన వివరాల ప్రకారం గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని నమ్మించి దారావత్ శంకర్ వద్ద 6 లక్షల రూపాయలు, రాథోడ్ మహేందర్ వద్ద 4 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. కాగా మండల కేంద్రంలో అదుపులో తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. సర్పంచ్ సురేష్ ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎవరిని నమ్మవద్దని సూచించారు. మోసం చేసే వ్యక్తులు ఎవరైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ శ్రీసాయి హెచ్చరించారు.

Next Story