- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iran: ట్రంప్, నెతన్యాహు సహా 13 మంది ప్రపంచ నేతలతో ఇరాన్ పత్రిక 'హిట్ లిస్ట్'
ఇరాన్‌కు చెందిన తీవ్రవాద ధోరణి గల 'హంషహ్రీ' వార్తాపత్రిక అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాలకు చెందిన 13 మంది అగ్రనేతల ఫోటోలతో కూడిన ఒక సంచలన 'హిట్ లిస్ట్' ఇన్‌ఫోగ్రాఫిక్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యతో మధ్యప్రాచ్యంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతీకార రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. ఖమేనీ వారసుడిగా భావిస్తున్న ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ.. తన తండ్రి అంత్యక్రియల అనంతరం శనివారం విడుదల చేసిన తొలి ప్రకటనలో, ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం తమ జాతీయ సంకల్పమని, బాధ్యులైన నేరస్థులెవరికీ ప్రశాంతంగా చనిపోయే అదృష్టం దక్కదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆయన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని, ఇరాన్‌కు చెందిన తీవ్రవాద ధోరణి గల 'హంషహ్రీ' వార్తాపత్రిక అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాలకు చెందిన 13 మంది అగ్రనేతల ఫోటోలతో కూడిన ఒక సంచలన 'హిట్ లిస్ట్' ఇన్‌ఫోగ్రాఫిక్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఇటలీ ప్రధాని మెలోని, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ వంటి కీలక నేతలు కూడా ఉండటం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ వివాదాస్పద ఇన్‌ఫోగ్రాఫిక్ ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అయినప్పటికీ, పత్రిక ఆదివారం ప్రింట్ సంచికలో మాత్రం ప్రచురించకుండా జాగ్రత్త పడ్డారు.






