ఆసక్తికరంగా 'మిస్టర్ మిడిల్ క్లాస్' ట్రైలర్..భ‌క్తుడిగా గెట‌ప్ లో శ్రీకాంత్

by velandi.Saikiran |

'మిస్టర్ మిడిల్ క్లాస్' సినిమాతో వస్తున్న శ్రీకాంత్... ఇందులో భక్తుడిగా కనిపించనున్నారు.

ఆసక్తికరంగా మిస్టర్ మిడిల్ క్లాస్ ట్రైలర్..భ‌క్తుడిగా గెట‌ప్ లో శ్రీకాంత్
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత హీరో అన్నగా, కొన్ని స్పెషల్ పాత్రల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. అలాంటి శ్రీకాంత్ ఇప్పుడు మళ్లీ హీరోగా థియేటర్ లో సందడి చేయనున్నారు. 'మిస్టర్ మిడిల్ క్లాస్' సినిమాతో వస్తున్న శ్రీకాంత్... ఇందులో భక్తుడిగా కనిపించనున్నారు. అటు వెంకటేశ్వర స్వామిగా రాజేంద్రప్రసాద్ ఇరగదీసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది.

మధ్య తరగతి భక్తుడికి అనుకోకుండా ఎక్కువ డబ్బులు వస్తే.. అతని జీవితంలో ఏం జరుగుతుందని కథను దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి అద్భుతంగా తీశారు. పాత సినిమాల తరహాలోనే కథను తీర్చిదిద్దిన దర్శకుడు.. సినిమా మొత్తం కామెడీని పండించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఇందులో హీరోయిన్ గా లయ కనిపించనున్నారు. సునీల్ తో పాటు అలీ తదితరులు ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. 90's లోకి జనాలను తీసుకువెళ్లింది. కాగా 'మిస్టర్ మిడిల్ క్లాస్' సినిమా ఈనెల 17వ తేదీన థియేటర్ లలో రిలీజ్ కానుంది.


Next Story