- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు బకాయిలు విడుదల చేయాలి.. రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రేపు (మంగళవారం) జూనియర్ కాలేజీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేసి, ఈ బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ, పేద విద్యార్థులకు ఎంతో కాలంగా అండగా నిలిచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
ప్రభుత్వ అలసత్వం వల్ల లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే విద్యార్థుల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకునేందుకు విద్యాసంస్థల బంద్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






