- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేధింపులతో యువతి ఆత్మహత్య
యువకుడి వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ఓ యువతి హత్యకు పాల్పడింది.

దిశ, మంచిర్యాల : యువకుడి వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ఓ యువతి హత్యకు పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టేకుమట్ల గ్రామానికి చెందిన యువతి గోశిక.మాధవి (26) హైదరాబాదులో బి ఫార్మసీ చదువుతుంది. అదే గ్రామానికి చెందిన గోనె.వెంకటేష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నాడు. ఇటీవల పురుగుల మందు డబ్బాతో యువతి ఇంటికి వెళ్లి వివాహం చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులు జైపూర్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వెంకటేష్ వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలో రహదారి పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు ఉత్తమ కుమార్తె మృతికి కారణమైన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భూమేష్ తెలిపారు.






