- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అశ్వారావుపేటలో పిచ్చికుక్క స్వైర విహారం
by Kodari Anjali |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది.

X
దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గోగులుబంధం షిరిడి సాయి నగర్ విధుల్లో దాదాపు 30 మందిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కాళ్లు, చేతులు, ముఖంపై కుక్క కాటుకు గురయ్యారు. దీంతో బాధితులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి క్యూ కట్టారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి పరామర్శించారు. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది గోగులుబంధం షిరిడి సాయి నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి పిచ్చికుక్కను మట్టుబెట్టారు.
Next Story






