హత్య కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

by Kodari Anjali |

సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 2024లో నమోదైన సంచలన హత్య కేసులో నిందితుడికి సికింద్రాబాద్ VI మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

హత్య కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 2024లో నమోదైన సంచలన హత్య కేసులో నిందితుడికి సికింద్రాబాద్ VI మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం, క్రైమ్ నం.580/2024లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103(1), 303(2) కింద కేసు నమోదు చేశారు. కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా చుమిలి గ్రామానికి చెందిన లింగప్ప (29) ఈ కేసులో నిందితుడు. విచారణ అనంతరం సికింద్రాబాద్ VI మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జి. వేణు నిందితుడిని దోషిగా నిర్ధారించి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసు దర్యాప్తును రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి. సాయీశ్వర్ గౌడ్ చేపట్టగా, డీఎస్ఆర్‌పీ ఎస్.ఎన్. జావేద్ పర్యవేక్షించారు.

Next Story