- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎరువుల దుకాణంలో వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీ
by Batti.Sumithra |
మిర్యాలగూడ మండల వ్యవసాయాధికారి ఎం. ఋష్యేంద్రమణి సోమవారం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

X
దిశ, మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ మండల వ్యవసాయాధికారి ఎం. ఋష్యేంద్రమణి సోమవారం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువుల విక్రయాల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సాయి మహేశ్వర ఫర్టిలైజర్స్, సిద్ధి వినాయక ఫర్టిలైజర్స్ దుకాణాల నుంచి ఎరువుల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించినట్లు వ్యవసాయాధికారి తెలిపారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందేలా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. తనిఖీల సందర్భంగా ఎరువుల డీలర్లు తెడ్ల జవహర్ బాబు, భిక్షం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Next Story






