- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ అమ్మాయిని నమ్మి చాలా మోసపోయా’.. హత్యలకు ముందు 'షాబాద్' హంతకుడి సంచలన సెల్ఫీ వీడియో
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సంచలనం సృష్టించిన హత్యల కేసులో కీలక పురోగతి లభించింది. హంతకుడు రాజ్ కుమార్ హత్యలు చేయడానికి ముందు రికార్డు చేసిన ఒక సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సంచలనం సృష్టించిన హత్యల కేసులో కీలక పురోగతి లభించింది. హంతకుడు రాజ్ కుమార్ హత్యలు చేయడానికి ముందు రికార్డు చేసిన ఒక సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలోనే అతడి మొబైల్ ఫోన్ కూడా దొరికిందని, ఆ ఫోన్‌లో ఈ వీడియో ఉన్నట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ (CP) తరుణ్ జోషి అధికారికంగా స్పష్టం చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజ్ కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టడానికి ముందు, జూలై 10వ తేదీ సాయంత్రం సరిగ్గా 4:55 గంటల సమయంలో తన ఫోన్‌లో ఈ వీడియోను రికార్డు చేశాడు. ఈ వీడియోలో తను ఎదుర్కొంటున్న మానసిక క్షోభ, ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరించినట్లు సీపీ తెలిపారు.
వీడియోలో రాజ్ కుమార్ వాంగ్మూలం..
లభ్యమైన వీడియోలో రాజ్ కుమార్ మాట్లాడిన మాటలను సీపీ వెల్లడించారు. "నా సంపాదనలో సగం వాళ్ల కోసమే ఖర్చు పెట్టాను. నా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో పైసలు వసూలు చేసి నన్ను పూర్తిగా లాస్ (నష్టపోవడానికి) చేశారు. ఆ అమ్మాయిని నమ్మి నేను పూర్తిగా అప్పుల పాలయ్యాను. ఆఖరికి నా పిల్లలకు రూపాయి భూమి కూడా లేకుండా చేసుకున్నా. నన్ను ఇంతలా ముంచేసి, లాస్టుకు నాపైనే కేసు పెట్టి నన్ను జైలుకు పంపించారు” అంటూ రాజ్‌కుమార్ ఆ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాను నమ్మిన వారి వల్లే అప్పులపాలయ్యానని, చివరికి తనపైనే కేసు పెట్టి జైలుకు పంపించారనే కక్షతోనే రాజ్కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అర్థమవుతోంది. దొరికిన మొబైల్ ఫోన్ను.. వీడియోను సైన్స్ అండ్ ఫోరెన్సిక్ ల్యాబు పంపించి మరిన్ని సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నామని, కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని సీపీ తరుణ్ జోషి పేర్కొన్నారు.






